యాక్టర్ తరుణ్ భాస్కర్‌కు ఫ్యాన్స్ పెరిగారు
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ అందుకుని సంచలనం క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది. తర్వాత రెండో సినిమ ఈ నగరానికి ఏమైంది తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా ఓ స్థాయి సంపాదించుకున్నాడు.
తర్వాత డైరెక్టర్ గా ఉంటూనే, కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు తరుణ్ భాస్కర్. నటుడిగా అతను మంచి మార్కులు వేసుకున్నప్పటికీ, డైరెక్టర్ గానే తనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవారు. కానీ రీసెంట్ గా వచ్చిన కీడా కోలా సినిమాతో మాత్రం ఆ అభిప్రాయాన్ని మార్చేశాడు తరుణ్. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన కీడా కోలా సినిమాలో నాయుడు అనే క్యారెక్టర్‌ను స్వయంగా తనే చేశాడు.
అయితే ఈసారి ఎప్పటిలా కాకుండా తరుణ్ నటుడిగానే ఎక్కువ మార్కులేయించుకున్నాడు. తెరపై తరుణ్ కనిపించినంతసేపు నవ్వులు పూయించాడు. మంచి ఎలివేషన్స్ సీన్స్ కూడా ఉండటంతో ఆ క్యారెక్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా మంచి మార్కులు వేసుకున్న తరుణ్ ఈసారి డైరెక్టర్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు.













