Dia Suriya: అందంలో తల్లిని మించిపోయిందిగా!
తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లోని ఫేమస్ స్టార్ జంటల్లో సూర్య(Suriya)- జ్యోతిక(jyothika) ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి దియా(Dia), దేవ్(Dev) అనే ఇద్దరు పిల్లలు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వీరిద్దరూ ఫ్యామిలీకి తగిన సమయాన్ని కేటాయిస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. సూర్య సినిమాల్లో నటించడమే కాకుండా అగరం అనే ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటారు.
రీసెంట్ గా అగరం ఫౌండేషన్(Agaram Foundation) 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ను నిర్వహించిన సూర్య, ఆ తర్వాత అటు నుంచి తిరుమల(Tirumala) వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం సూర్య ఫ్యామిలీతో ఫోటోలు దిగడానికి అక్కడికి ఎంతో మంది గూమిగూడగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే ఆ ఫోటోలు, వీడియోల్లో ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది సూర్య, జ్యోతిక కాదు. వారి కూతురు దియా. తిరుమల దర్శనం కోసం సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన దియా ను చూసి అప్పుడే ఇంత పెద్దమ్మాయి అయిపోయిందా అని కొందరు అంటుంటే, తల్లిని మించిన అందం అంటూ మరికొందరు, ఇంకొందరైతే త్వరలోనే హీరోయిన్ గా దియా ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్స్ చేస్తూన్నారు.







