సోనూసూద్‌కి కరోనా పాజిటివ్
రియల్ హీరో, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోను ఓ ట్వీట్ పెట్టారు. నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్వీయ నిర్భంధంలోకి వెళ్లాను. తగిన జాగ్రత్తలు పాటిస్తున్నాను. కానీ, మీరు ఏమాత్రం బాధపడకండి మీ సమస్యలను తీర్చేందుకు దీనివల్ల నాకు మరింత సమయం దొరికింది. గుర్తుపెట్టుకోండి నేను ఎప్పటికీ మీకు అండగా ఉంటాను. మీకోసం ఉంటాను అని ట్వీట్ చేశారు.
గతేడాది కరోనా విపత్కర పరిస్థితుల్లో సోనూసూద్ వేలాది మందికి సాయం అందించాడు. ఉపాధి వేటలో భాగంగా వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలకు గతేడాది లాక్డౌన్ సమయంలో సోనూసూద్ ఎన్నో సేవలు అందించారు. ప్రయాణ సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీల కోసం బస్సులు, రైళ్లను ఆయన ఏర్పాటు చేయించారు. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులను సైతం స్వదేశానికి తీసుకువచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేయించి అందరి ప్రనశంసలు అందుకున్నారు. సోనూసూద్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులంతా సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు.







