Sivaji: హీరోయిన్ల బట్టల విషయంలో శివాజీ కామెంట్స్
బిగ్ బాస్(Bigg Boss) కు వెళ్లొచ్చాక శివాజీ(Sivaji) కెరీర్ మొత్తం మారిపోయింది. 90స్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవడం, ఆ తర్వాత వచ్చిన కోర్టు(Court) సినిమాలో మంగపతిగా నటించి అందరినీ అద్భుతంగా మెప్పించడంతో పాటూ ఈ మధ్య ఆయన ఎంపిక చేసుకుంటున్న క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయి. అలాంటి శివాజీ త్వరలోనే దండోరా(Dandora) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తాజాగా దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఆ ఈవెంట్ లో శివాజీ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ, హీరోయిన్ల బట్టల విషయంలో తన ఒపీనియన్ ను వెల్లడించాడు. సాంప్రదాయ దుస్తులు, చీరలు ధరించడంలోనే మహిళల అందం, ఆత్మ గౌరవం ఉంటుందని, వాటితో అవి మరింత పెరుగుతాయని ఆయన అన్నాడు.
చిన్న బట్టలు వేసుకోవడం తప్పు కాదని చెప్తూనే, అలాంటివి వేసుకోవడం వల్ల సమాజం మౌనంగా తీర్పు ఇస్తుందని, సరైన బట్టలు వేసుకుంటే నేచురల్ గానే ఎట్రాక్టివ్ గా కనిపిస్తారని కామెంట్స్ చేయగా, ఆ వ్యాఖ్యలు క్షణాల్లోనే నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు ఆయనకు లేదని, అతని ఆలోచనలన్నీ పాత కాలంగా ఉన్నాయని కామెంట్స్ చేస్తూ ఆయన్ని విమర్శిస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.






