టాలీవుడ్ లో మరో యంగ్ హీరోకు పెళ్లికళ
ఇప్పటివరకు చూడని విధంగా ఈ కరోనా క్రైసిస్ లో తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు లేక, సినిమాలు రిలీజులు లేక అందరు ఇంటి పట్టునే వున్నా, టాలీవుడ్ లో పెళ్లిళ్లు మాత్రం ఈ శుభసమయంలోనే జరుగుతున్నాయి హీరోలు నిఖిల్ సిద్ధార్థ్, నితిన్, రానా దగ్గుబాటి ఇప్పటికే వివాహలు చేసుకొని ఓ ఇంటివారయ్యారు. మరోవైపు మెగా డాటర్ నిహారిక ఎంగేజ్మెంట్ అవగా, ‘కృష్ణా అండ్ హిజ్ లీల’ నటి షాలిని తమిళ దర్శకుడు మనోజ్‌తో ఏడడుగులు నడిచిన విషయం తెలిసిందే. 2020 అస్సలు బాగోలేదని అందరూ పెదవి విరుస్తుంటే టాలీవుడ్‌లోని హీరోలు మాత్రం దీనికి మించిన శుభ ముహూర్తం దొరకదంటూ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తాజాగా మరో యువ కథానాయకుడు శర్వానంద్ కూడా పెళ్లి కొడుకుగా ముస్తాబవనున్నట్లు సమాచారంచిన్ననాటి స్నేహితురాలు, మహిళా పారిశ్రామికవేత్తతో ఈ వివాహం జరగనుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనకు స్నేహితురాలిపై చిగురించిన ప్రేమను పెద్దలు అర్థం చేసుకుని అంగీకారం తెలిపారని ఫిల్మీ దునియాలో వినిపిస్తోంది. మరి ఇదెంతవరకు నిజమనేదానిపై శర్వానంద్ అధికారిక ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే. కాగా శర్వానంద్ ప్రస్తుతం “శ్రీకరం” అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న రెండో చిత్రమిది. సాయికుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.













