బాలీవుడ్ లో మరో విషాదం… రాజీవ్ కపూర్ ఇక లేరు
బాలీవుడ్లో మరో విషాదం చోటుచేసుకుంది. నటుడు రిషి కపూర్ సోదరుడు రాజీవ్ కపూర్(58) మృతిచెందారు. గుండెపోటుతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రిషి కపూర్ భార్య నీతూ కపూర్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ కపూర్ ఫోటో షేర్ చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. కాగా దివంగత నటుడు రాజ్ కపూర్‌కు చిన్న కుమారుడు రాజీవ్ కపూర్. రాజ్ కపూర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అన్న విషయం తెలిసిందే. రాజీవ్ కపూర్ రామ్ తేరి గంగా మెయిలీ చిత్రంలోని నరేంద్ర పాత్రతో ప్రసిద్ది చెందారు. ఈ చిత్రం 1985లో సంవత్సరంలో విడుదలైంది.













