హీరో రాజశేఖర్ హాస్పటల్ నుండి డిశ్చార్జ్ ..
కరోనా సోకిన సీనియర్ హీరో రాజశేఖర్ అప్పటినుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్ వారు హీరో రాజశేఖర్ కి నెగటివ్ రిపోర్ట్ రావడం తో డిశ్చార్జ్ చేసారు. ఈ సందర్భంగా సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి సిబ్బంది సెండ్ ఆఫ్ చేస్తూ ఫోటోలు దిగారు. గత కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్లో ఆయనకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. ఆయన ఐసియూలోనే ఉండటంతో రాజశేఖర్ ఫ్యాన్స్ ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు (సోమవారం) ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని తెలుపుతూ డిశ్చార్జ్ చేసారు. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డామని రాజశేఖర్ స్వయంగా పేర్కొనడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్లో చికిత్స పొందారు.













