నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబెర్స్
అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ‘మా’ ఎలక్షన్ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నేటినుంచి నామినేషన్స్ స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకాష్ రాజ్ తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సారి ‘మా’ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ కనిపిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పటికే తమ ప్యానల్ వివరాలు ప్రకటించిన ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఎన్నికల ప్రణాళికపై కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈ రోజు (సెప్టెంబర్ 27) నామినేషన్ల ప్రక్రియ షురూ కావడంతో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో సహా వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.’మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ప్రకాష్ రాజ్, అతని టీమ్ నామినేషన్ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ప్రతి విషయంలో తమ టీమ్ ముందే ఉంటుందని అన్నారు. ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే అని మరోసారి పేర్కొన్నారు. ‘మా’ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని చెప్పిన ఆయన.. అక్టోబర్ 3న తమ ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. ఇకపోతే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా నామినేషన్ వేసిన జీవితా రాజశేఖర్.. చిరంజీవి మద్దతు విషయమై కొన్ని కామెంట్స్ చేశారు. ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికలకు పక్కా ప్రణాళిక తయారు చేశారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. చిరంజీవి గారి మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉందనడానికి తమ దగ్గర ఆధారాలు లేవని, చిరంజీవి మద్దతు విష్ణుకు కూడా ఉండొచ్చు అని అన్నారు జీవిత. ఈ ఎన్నికలను తప్పుదారి పట్టించవద్దని, ఒకొరినొకరు కించపరుచుకోకుండా ఎన్నికలు సజావుగా జరగాలని ఆమె కోరారు.
ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మెయిన్ ప్యానల్ సభ్యులు:
1. అధ్యక్షుడు- ప్రకాశ్‌రాజ్
2. ట్రెజరర్-నాగినీడు
3. జాయింట్ సెక్రటరీ: అనితా చౌదరి, ఉత్తేజ్
4. ఉపాధ్యక్షుడు: బెనర్జీ, హేమ
5. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: శ్రీకాంత్
6. జనరల్ సెక్రటరీ: జీవితా రాజశేఖర్
ప్రకాశ్ రాజ్ ఎక్స్క్యూటివ్ మెంబర్స్ జాబితా:
1. అనసూయ
2. అజయ్
3. భూపాల్
4. బ్రహ్మాజీ
5. ప్రభాకర్
6. గోవింద రావు
7. ఖయూమ్
8. కౌశిక్
9. ప్రగతి
10. రమణా రెడ్డి
11. శివా రెడ్డి
12. సమీర్
13. సుడిగాలి సుధీర్
14. సుబ్బరాజు. డి
15. సురేష్ కొండేటి
16. తనీష్
17. టార్జాన్













