‘ధ్వని’ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన నవదీప్
వినయ్, పాణిగ్రాహి, స్వాతి మండది ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధ్వని. నాగ దుర్గారావు సాన దర్శకత్వం వహిస్తున్నారు. సాధన నన్నపనేని నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని కథానాయకుడు నవదీప్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్టి, పట్టుదల కలిగిన దర్శకుడు దుర్గ. తను నాకు రెండేళ్లుగా తెలుసు. ఓ మంచి ప్రయత్నం చేశారు. కచ్చితంగా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. శబ్ధానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యాధితో బాధపడే వ్యక్తి జీవితంలో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందింది. ఇందులో కాన్సెప్ట్ ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. త్రినాథ్ శర్మ, రవీందర్ రెడ్డి, భానవ సాగి, సురేష్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రతీక్, ఆనంద్ నంబియార్.













