అనుకోకుండా డైరెక్టర్ అయిన నటుడు
తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ అందరికీ సుపరిచితుడే. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘హ్యాపీ’, ‘గరుడవేగ’ వంటి పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడీ నటుడు అనుకోకుండా దర్శకుడిగా మారాడు. అది ఎలా అంటే కన్నడ, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమాలో కిషోర్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షూటింగ్ జరుగుతున్న సమయంలో కథలో అనేక మార్పులు చెయ్యాల్సి వచ్చింది. దీంతో తనే దర్శకుడి అవతారం ఎత్తి సినిమాని కంప్లీట్ చేశారు కిషోర్. ఓ విలక్షణమైన కథాంశంతో ఒకే లొకేషన్లో రూపొందిన ఈ సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చిత్ర యూనిట్ తెలియజేస్తోంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా థియేటర్లో సినిమాను విడుదల చేసే అవకాశం లేకపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ‘బ్లాక్ అండ్ వైట్’ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.













