జాన్ కొట్టోలీ ఇక లేరు
తెలుగు సినిమాలో ఇప్పుడిప్పుడే నటుడిగా రాణిస్తున్న జాన్ కొట్టోలి(40) మంగళవారం తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన మరణించారు. తక్కువ సినిమాలే అయినా, నటుడిగా తనదైన ముద్ర వేశారు జాన్. సినీ నటుడు కాకముందు థియేటర్ ఆర్టిస్ట్‌గా పని చేశారు జాన్. పలు షార్ట్ ఫిలింస్‌తో పాటు మను, ఫలక్‌నుమాదాస్, రక్తం, యుద్ధం శరణం వంటి తెలుగు సినిమాల్లో సహాయ నటుడిగా నటించారు జాన్. గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్ సిరిసీస్లోనూ నటించారాయన. తక్కువ వయసులోనే దూరం కావడంతో, చిత్ర పరిశ్రమలోని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ నేపథ్యమున్న ఆయన కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, తొమ్మిదేళ్ల కుమార్తె ఉన్నారు.













