నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి..
విలక్షణ నటనతో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయసు 72ఏళ్ళు. లాక్ డవున్ కారణంగా షూటింగ్స్ లేకపోవడంతో ప్రస్తుతం గుంటూరు లోని స్వగృహంలో కొన్ని నెలలుగా వుంటున్నారాయన. కర్నూలు జిల్లా కు చెందిన జయప్రకాష్ రెడ్డి 1985 ప్రాంతంలో వచ్చిన బ్రహ్మపుత్రుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు.
దాదాపు పదేళ్ల తర్వాత ప్రేమించుకుందాం రా సినిమా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. అక్కడ నుంచి ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. రాయలసీమ మాoడలీకం తో అద్భుతమైన విలనిజం ద్వారా తనదైన ప్రత్యేకత ని చాటుకున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన నరసింహ నాయుడు, సమర సింహారెడ్డి వంటి సినిమాలు సినీ రంగంలో టాప్ యాక్టర్స్ లో ఒకరిగా నిలిపాయి. డీ, రెడీ, .వంటి సినిమాలు ఆయన లోని కామెడీతో కూడిన విలనిజంని ప్రేక్షకులకు పరిచయం చేశాయి. దశాబ్దాలుగా తన అభినయం తో అలరించిన జయప్రకాష్ రెడ్డి చివరి సినిమా సరిలేరు నీకెవ్వరూ. వ్యక్తిగతంగా నాటక రంగాన్ని బాగా ఇష్టపడే జయప్రకాష్ రెడ్డి కి అలెగ్జాండర్ పాత్ర అంటే చాలా ఇష్టం. దాదాపు1000 సార్లు అలెగ్జాండర్ పాత్ర ను రంగస్థలం సై పండించారాయన.













