తెలుగులో దుల్కర్ సల్మాన్ రెండో సినిమా
దుల్కర్ సల్మాన్… మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడిగా, ఒక మంచి నటుడిగా అందరికీ పరిచయమే. తెలుగులో నటించింది `మహానటి` ఒక్కటే అయినా అతను చేసిన ఇతర భాషా చిత్రాలు తెలుగులో అనువాదమై మన ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు దుల్కర్ తెలుగులో రెండో స్ట్రెయిట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. హను చెప్పిన స్టోరీలైన్ బాగా నచ్చిందని, రొమాంటిక్ థ్రిల్లర్‌గా అందరికీ నచ్చే సినిమా అవుతుందని దుల్కర్ తెలిపారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేస్తారు. `మహానటి` చిత్రంలో జెమినీ గణేశన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషించిన దుల్కర్ లవర్‌బోయ్‌గా ఎలా ఉంటాడో చూడాలని తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైజయంతి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమాను ప్రారంభిస్తారు. ఈ సినిమాలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటించబోతోందని తెలుస్తోంది. లాక్‌డౌన్‌కి ముందే ఆమెను అప్రోచ్ అయి కథ వినిపించారట. పూజ హైదరాబాద్ రాగానే ఈ ప్రాజెక్ట్ కోసం సైన్ చేస్తుందని సమాచారం.













