‘మురారి’ డీఎస్ దీక్షితులు కన్నుమూత
ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు కన్నుమూశారు. ఓ సినిమా చిత్రీకరణలో ఉండగా ఆయనకు గుండెపోటు రావడంతో నాచారం ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలోనే దీక్షితులు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన మురారి చిత్రంలో దీక్షితులు పూజారి పాత్రలో నటించారు.
దీక్షితులు తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చారు. ఏపీ థియేటర్ ఇనిస్టిట్యూట్ అండ్ రిపర్టీరీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరారు. దీక్షితులు డిప్లొమా చేస్తున్న సమయంలో పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆగమనం సీరియల్ కు గాను దీక్షితులు నంది అవార్డు అందుకున్నారు.













