Killer : డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్”
"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ (Purwaj) "కిల్లర్"(Killer ) అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన వన్ ఆఫ్ ది హీరోగా నటిస్తుండటం విశేషం. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.
"కిల్లర్" పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. 10 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొన్నారు. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో మరో హీరో విశాల్ రాజ్ పాల్గొంటారు. రామోజీ ఫిలిం సిటీ, మొయినాబాద్ లొకేషన్స్ లో జరిగే ఈ రెండో షెడ్యూల్ లో గౌతమ్ అనే యాక్టర్ తో పాటు జ్యోతి పూర్వజ్ కూడా జాయిన్ కాబోతున్నారు.













