ఆచార్య నుంచి త్రిష ఔట్
మెగాస్టార్ చిరంజీవి చిత్రం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది కథానాయిక త్రిష. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఆచార్య తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయికగా త్రిషని ఎంపిక చేసుకున్నారు. త్వరలోనే ఆమె చిత్రీకరణలో పాల్గొనాల్సి ఉంది. ఇంతలోనే ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కొన్నిసార్లు తొలుత మనతో చర్చించిన విషయాలు ఒకటైతే.. తర్వాత అక్కడ కనిపించేవి మరోలా ఉంటాయి. ఇలాంటి విభేదాల కారణంగానే చిరంజీవి సర్ చిత్రం నుంచి తప్పుకుంటున్నా. మరో ఆసక్తికరమైన సినిమాతో త్వరలోనే నా ప్రియమైన తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తా అని ట్వీట్ చేసింది త్రిష.













