ఐదు నుంచి ఆచారి అమెరికా యాత్ర
మంచు విష్ణు, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఆచారి అమెరికా యాత్ర. జి.నాగేశ్వరెడ్డి దర్శకుడు. కీర్తి చౌదరి, కిట్టు నిర్మాతలు. ఈ నెల 5 నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. విష్ణు సరసన కథానాయికగా ప్రగ్యాజైస్వాల్ని ఎంచుకొన్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం విజయాల అనంతరం విష్ణు-నాగేశ్వరెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రమిది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. విష్ణు, బ్రహ్మానందం మధ్య తెరకెక్కించే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, ఎల్బీ శ్రీరామ్, పృథ్వీ, ప్రవీణ్, అనూప్ ఠాకూర్ తదితరులు నటిస్తున్నారు. మాటలు: డార్లింగ్ స్వామి, సంగీతం :తమన్.













