ఈ దసరా సీజన్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న భారీ సినిమాలు

మహారాష్ట్రలో యాభై శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు ప్రారంభం కావడం శుభ పరిణామంగా టాలీవుడ్ భావిస్తోంది. అక్కడ షూటింగులు కూడా మొదలుపెట్టడం తో టాలీవుడ్ లో నెమ్మదిగా చలనం మొదలైంది. లాక్ డౌన్ సడలించిన తరువాత టాలీవుడ్ కూడా కరోనా నిబంధనల సడలింపుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఒక్కసారి అనుమతులు వస్తే టాలీవుడ్ ఫుల్ బిజీ అవుతుంది అంటున్నారు. ఇక టాలీవుడ్ సమ్మర్ సీజన్ పూర్తిగా రివర్స్ అయింది. దాంతో కరోనా రెండవ దశ నెమ్మదిస్తున్న నేపధ్యంలో దసరా ఫెస్టివల్ మీద ఇక ఆశలు పెట్టుకుంది. రెండేళ్ళకు పైగా ఊరిస్తున్న ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా నుంచి మొదలుపెడితే చాలా మూవీస్ దసరా పండుగను ఎట్టి పరిస్థితుల్లో విడుదలలు వదులుకోరాదు అని భావిస్తున్నారుట. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన సినిమాలతో పాటు కొంచెం పాచ్ వర్క్ ఫినిష్ అయితే చాలు సినిమా రిలీజ్ కి రెడీ చేయవచ్చు అన్న వారంతా దసరా వైపు చూస్తున్నారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఏప్రిల్, మే, జూన్, జాలై నెలల్లో రిలీజ్ కి షెడ్యూల్స్ ఇచ్చి వాయిదా పడిన సినిమాలు అన్నీ కూడా ఇపుడు దసరా కోసం దూసుకువస్తున్నాయట. ఈ సినిమాల్లో పాన్ ఇండియా మూవీస్ గా రాధేశ్యామ్, కేజీఎఫ్ ఉంటే ఆచార్య, అఖండ వంటి బిగ్ మూవీస్ ఉన్నాయి. అలాగే రవిరేజా ఖిలాడీ మూవీతో పాటు అక్కినేని హీరోల సినిమాలూ క్యూ కడతాయట. అదే విధంగా అనేక చిన్న సినిమాలు కూడా మేము రెడీ అంటున్నాయి. చూడబోతే దసరా అన్నది కేవలం పది రోజుల సీజన్. మరి భారీ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అంటే అక్కడ జరిగేది మంచి పోటీ కూడా మరి అందరికీ థియేటర్లు దొరకాలి, రిలీజ్ కి ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలి. మొత్తానికి ఈ దసరా మాత్రం చాలా సరదాగా గడుస్తుందని టాలీవుడ్ భావిస్తోంది.