అచ్చమైన తెలుగింటి పిల్లవే …పాటను విడుదల చేసిన దర్శకుడు మారుతి
పార్వతీశం, హాస్యనటి శ్రీలక్ష్మి జంటగా నటించిన చిత్రం సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి. చైతన్య కొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోగుల నరేంద్ర నిర్మాత. అచ్చమైన తెలుగింటి పిల్లవే అంటూ సాగే ఈ సినిమాలోని తొలి పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. సత్య కశ్యప్ స్వరకల్పనలోని ఈ గీతాన్ని సాయిచరణ్ ఆలపించగా, ప్రణవం రచించారు. పాట చాలా బాగుందని, సినిమా విజయవంతం కావాలని దర్శకుడు మారుతి ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ స్వచ్ఛమైన కటుంబ కథా చిత్రమిది. ఇరవయ్యేళ్ల యువకుడు, అరవయ్యేళ్ల మహిళ ఎలా భార్యభర్తలు అయ్యారనేది తెరపైనే చూడాలి అన్నారు. నిర్మాత మాట్లాడుతూ చిత్రీకరణ పూర్తయింది. నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం అన్నారు. శివారెడ్డి, సుమన్‌శెట్టి, గౌతంరాజు, సుబ్బరాయ్య శర్మ నటిస్తున్నారు.













