షారుఖ్ సినిమాలో అభిషేక్ బచ్చన్
బాలీవుడ్ బాద్షా తన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనరుపై నిర్మించే కొత్త చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. బాబ్ బిస్వాస్ పేరుతో రూపుదిద్దుకొనే ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తారు. ఇంతవరకూ పోషించని ఓ విభిన్న పాత్రను ఇందులో అభిషేక్ చేయనున్నారు. షారుఖ్ నిర్మించిన బద్లా దర్శకుడు సుజయ్ ఘోష్ కుమార్తె దివ్య అన్నపూర్ణా ఘోష్ ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. షారుఖ్ ఖాన్ శ్రీమతి గౌరీ ఖాన్, సుజయ్ ఘోష్, గౌరవ్ వర్మ ఈ చిత్రానికి నిర్మాతలు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.













