ఎన్టీఆర్ చిత్రంలో అభయ్?
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ చిత్రం వస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సోమవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి హీరో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొడుకు అభయ్‌రామ్ ఓ చిన్న పాత్రలో నటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం పూజా కార్యక్రమంలో అభయ్‌రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే తన తనయుడి పాత్ర గురించి ఎన్టీఆర్ ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు అభయ్‌రామ్ కూడా తెరపై సందడి చేయనున్నాడన్న వార్తలు వస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













