‘ఏబీసీడీ’ ట్రైలర్ విడుదల
అల్లు శిరీష్ ప్రస్తుతం మలయాళ చిత్రం ఎబిసిడి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ)ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్ రంగినేని, మధుర’ శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యూఎస్ నుండి విహార యాత్రకి ఇండియాకి వచ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి తన జీవితంలో ఎదురైన సంఘటలని ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాడనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించనున్నారట.
ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో కథానాయికగా నటించి మెప్పించిన రుక్సర్ థిల్లాన్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.













