కొత్త హీరోకు ఓకే చెప్పేసిన సాయి పల్లవి
తన సినీ అరంగేట్రం నుంచి ఇప్పటి వరకు పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలే చేస్తూ వచ్చిన సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం శివ కార్తికేయన్‌తో చేస్తున్న ఫాంటసీ సినిమా తప్ప మరోటి లేదు. కథ విపరీతంగా నచ్చి నటనకు స్కోప్ ఉంటే తప్ప సినిమాలు ఒప్పుకోని సాయి పల్లవి చాలా నెలలుగా గ్యాప్ తీసుకుంది. డైరెక్టర్లు ఆమెను కలుస్తున్నప్పటికీ స్టోరీ నచ్చకపోతే రెమ్యూనరేషన్ ఎంత ఆఫర్ చేసినా కానీ సాయి పల్లవి నో అనే చెప్తుంది.
నాగచైతన్య, చందూ మొండేటి కాంబోలో వస్తున్న సినిమా కోసం సాయి పల్లవిని సంప్రదించారని టాక్ ఉంది కానీ దానిపై అమ్మడు ఎలా స్పందించింది? అసలు నిజంగానే వారు సంప్రదించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి ఇప్పుడో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అది కూడా ఓ కొత్త హీరో అయిన అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో.
సునీల్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఓ లవ్ స్టోరీ నటించేందుకు అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రంగ్ దే బసతి నుంచి లాల్ సింగ్ చడ్డా వరకు ఎన్నో సినిమాలకు అసోసియేట్‌గా పనిచేసిన సునీల్ పాండేకు అమీర్‌తో మంచి అనుబంధం ఉంది. ఆ చనువుతోనే ఓ స్టోరీ రెడీ చేసుకుని జునైద్‌తో ఓకే చేయించుకున్నాడు.
సాయి పల్లవి సినిమాను ఓకే చేసిందంటే స్టోరీలో డెప్త్ బాగానే ఉండి ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా కంటే ముందే జునైద్ యష్ రాజ్ ఫిల్మ్స్ తీయబోయే డెబ్యూ మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పటికే సెట్స్ పై ఉంది. మొత్తానికి సాయి పల్లవి ఓ కొత్త హీరోతో సినిమా చేయడానికి ఒప్పుకుని అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. మరి ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బాలీవుడ్లో ఎలాంటి అవకాశాలు దక్కించుకుంటుందో చూడాలి.













