లవ్ టుడే రీమేక్‌లో బాలీవుడ్ వారసులు
గతేడాది వచ్చిన తమిళ బ్లాక్ బస్టర్ లవ్ టుడ్ బాగా సక్సెస్ కావడంతో దాన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా మరిన్ని భాషల్లోకి రీమేక్ కాబోతుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాకు ఓ క్రేజీ కాంబోని సెట్ చేయబోతున్నట్లు ముంబై సినీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ సినిమా కోసం ముందుగా వరుణ్ ధావన్ ని అనుకున్నారు కానీ ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో కొత్త జంట అయితేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఆర్టిస్ట్ ల కోసం చాలా నెలల నుంచి వెయిట్ చేశారు. ఇన్నాళ్లకు అది ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ఈసినిమాకు అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్‌ను లీడ్ పెయిర్‌గా లాక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే అఫీషియల్ గా ఈ సినిమాను లాంఛ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికీ ఇది డెబ్యూ సినిమాగా రాకపోవచ్చు. ఇప్పటికే జునైద్ యష్ రాజ్ నిర్మిస్తోన్న ఓ థ్రిల్లర్ మూవీతో ఎంట్రీ ఇవ్వగా, ఖుషి కపూర్ నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటోంది. లవ్ టుడే రీమేక్ కంటే ఈ సినిమాలే ముందు రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.
డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రదీప్ రంగనాధన్ నే అనుకున్నారు కానీ అతనికి వేరే కమిట్మెంట్ల వల్ల అతను చేయడం డౌట్ లాగే ఉంది. స్టోరీని పూర్తిగా మార్చకుండా జస్ట్ సౌత్ ఫ్లేవర్ ఉన్న సీన్లను మాత్రం కొంచెం మార్చనున్నారట. మరి ఈ రీమేక్ బాలీవుడ్ లో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.













