L2 Empuraan: ఎల్2: ఎంపురాన్లో అమీర్ సోదరి
మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohan Lal) హీరోగా నటించిన లూసీఫర్(lucifer) సినిమా ఎంత పెద్ద హిట్ అనేది మళ్లీ చెప్పనక్కర్లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumar )దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ప్రీక్వెల్ గా ఇప్పుడు పార్ట్2 ను నిర్మించారు. ఎల్2: ఎంపురాన్(L2:Empiraan) టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే ఈ మూవీలో అమీర్ ఖాన్(Aamir khan) సోదరి నిఖితా ఖాన్ హెగ్డే(Nikhitha khan Hegde) ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఆమె ఇప్పటివరకు సౌత్ సినిమాల్లో నటించింది లేదు. నిఖితా ఖాన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. కానీ ఆమె సౌత్ లో చేస్తున్న మొదటి మూవీ ఇదే. మిషన్ మంగళ్(mission Mangal) తో 2019లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిఖితా ఖాన్ ఎక్కువగా కమర్షియల్ యాడ్స్లోనే కనిపించింది.
రిలయన్స్ జువెల్స్(reliance jewels), హల్దీరామ్స్(Haldirams), యాక్సిస్ బ్యాంక్(Axis bank), ఫస్ట్ క్రై(First cry), విప్రో(Wipro) యాడ్స్ నిఖితా ఖాన్ కు ఎంతగానో గుర్తింపును తెచ్చి పెట్టాయి. అమీర్ ఖాన్ నటించిన లగాన్(Lagaan) సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిఖితా ఖాన్ ఎల్2: ఎంపురాన్లో సుభద్ర బెన్ పాత్రలో నటిస్తోంది. ట్రైలర్ తో ఎల్2 మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి.













