Coolie: కూలీలో ఆమిర్ క్యారెక్టర్ పై క్రేజీ బజ్

సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth), లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూలీ(Coolie). లియో(Leo) సినిమా తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి తోడు ఆ సినిమాలో సూపర్ స్టార్ హీరోగా నటిస్తుండటంతో కూలీపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాను తన సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా స్టాండలోన్ ఫిల్మ్ గా లోకేష్ రూపొందిస్తున్నారు.
స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నాగార్జున(Nagarjuna) విలన్ గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర(Upendra) కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటూ బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(aamir Khan) కూడా కూలీలో నటించనున్నట్టు సితారే జమీన్ పర్(sithaare zameen par) ప్రమోషన్స్ లో క్లారిటీ ఇచ్చారు. కూలీలో తన క్యారెక్టర్ క్లైమాక్స్ లో ఉంటుందని, తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆమిర్ చెప్పారు.
ఇదిలా ఉంటే కూలీ సినిమాలో ఆమిర్ పాత్రపై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ లో 15 నిమిషాల పాటూ ఆమిర్ ఖాన్ ఓ పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ కనిపిస్తారని, ఆమిర్- రజినీ మధ్య యాక్షన్ తో కూడిన ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని, ఈ క్లైమాక్స్ ను రాజస్తాన్ లో షూట్ చేసినట్టు చెప్తున్నారు. అనిరుధ్ రవిచందర్(anirudh ravichander) సంగీతం అందించనున్న ఈ సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది.