నేను రాజకీయాల్లోకి రాను
బాలీవుడ్ అగ్రనటుడు అమీర్‌ఖాన్ రాజకీయాల్లోకి వస్తున్నరని ఇటీవల కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీతో కలిసి పని చేయనున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. తాను రాజకీయాల్లో రావడం లేదని ఆయన తేల్చి చెప్పారు. తనకు రాజకీయాలంటే భయమని ఆయన పేర్కొన్నారు. తాను నటుడిని మాత్రమేనని, తన ప్రతిభే తనకు బలమని ఆయన సృష్టం చేశారు. తన జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన వెల్లడించారు. తాను స్థాపించిన పానీ స్వచ్చంధ సంస్థ గురించి ఆయన వివరించారు. ఈ సంస్థను నడిపించడం తన ఒక్కడి వల్లనే, ప్రభుత్వం వల్లనో కాదని, మహారాష్ట్ర ప్రజలే ఓ ఉద్యమంలా ఏర్పడితేనే పలు ప్రాంతాలను కరవు రహితంగా మార్చగలమని ఆయన చెప్పారు. నీటిని పొదుపుగా వాడుకునే విషయంలో ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.













