Aamir Khan: ఆమిర్ తెలివైన నిర్ణయం
ఆమిర్ ఖాన్(aamir khan) సూపర్ హిట్ ఫిల్మ్ తారే జమీన్ పర్(taare zameen par) సినిమా మంచి హిట్ అయినప్పటికీ ఆ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమిర్ ఒక తెలివైన స్ట్రాటజీని ఉపయోగించి లబ్ధి పొందనున్నాడు. ప్రస్తుతం ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్(Sitaare Zameen Par) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఈ సందర్భంగా ఫ్యాన్స్ మీట్ ను ఏర్పాటు చేసిన ఆమిర్ తన పాత సినిమా తారే జమీన్ పర్ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు చాలా కాలం నుంచి రిలీజ్ చేయలేదని, తాను కొత్తగా మొదలుపెట్టిన యూ ట్యూబ్ ఛానెల్ ఆమిర్ ఖాన్ టాకీస్ లో ఈ సినిమాను అప్లోడ్ చేయనున్నామని తెలిపాడు. అయితే ఈ సినిమా యూ ట్యూబ్ లో ఒకటి, రెండు వారాల వరకు మాత్రమే ఫ్రీ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంటుందని సమాచారం.
తారే జమీన్ పర్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా సితారే జమీన్ పర్ రిలీజవుతున్న టైమ్ లో ఆమిర్ ఆ సినిమాను ఫ్రీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురావడం చాలా మంచి స్ట్రాటజీనే. అయితే తారే జమీన్ పర్ కు, ఇప్పుడొస్తున్న దాని సీక్వెల్ కు సంబంధం లేదని, ఈ సినిమా స్పోర్ట్స్ కామెడీ డ్రామాగా తెరకెక్కిందని తెలుస్తోంది. తారే జమీన్ పర్ లో స్క్రీన్ ప్లే తో పాటూ అందులో ఉన్న సందేశం అందరినీ ఆకట్టుకుంది. మరి సితారే జమీన్ పర్ మునుపటి సినిమాలా హిట్ అవుతుందా లేదా అనేది చూడాలి. లాల్ సింగ్ చడ్డాతో ఫ్లాప్ ను అందుకున్న ఆమిర్ ఖాన్ కు ఇప్పుడు అర్జెంటుగా హిట్ అవసరం ఎంతో ఉంది. మరి సితారే జమీన్ పర్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.






