Lokesh Kanagaraj: లైన్లో పడుతున్న లోకేష్ డ్రీమ్ ప్రాజెక్ట్?
మా నగరం(Maa Nagaram) సినిమాతో కెరీర్ ను స్టార్ట్ చేసిన లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) చేసింది తక్కువ సినిమాలే అయినా సౌత్ లో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)తో కూలీ(Coolie) సినిమా చేస్తున్న లోకేష్ ఆ సినిమా కోసం నాగార్జున(Nagarjuna), ఉపేంద్ర(Upendra), ఆమీర్ ఖాన్(Aamir Khan) లాంటి స్టార్లను రంగంలోకి దింపాడు. దీంతో కూలీపై అంచనాలు భారీగా పెరిగాయి.
ఇదిలా ఉంటే లోకేష్ కు ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఇరుంబుకై మాయావి(Irumbukai Maayavi) అనే సినిమాను ఎన్నో ఏళ్ల కిందట ప్లాన్ చేసుకుని సూర్యతో సినిమాను లాక్ చేసుకుని కొన్ని పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. కానీ బడ్జెట్ కారణాలతో ఆ సినిమా సెట్స్ కు వెళ్లకుండానే ఆగిపోయింది. భారీ వీఎఫ్ఎక్స్ అవసరమున్న ఆ ఫాంటసీ కథ ఇకపై ఎప్పటికీ తెరకెక్కదని అందరూ అనుకున్నారు.
కానీ లోకేష్ ఇప్పుడా కథని ఆమీర్ ఖాన్ కు వినిపించాడట. ఆమీర్ కు కథ బాగా నచ్చి వెంటనే సొంత బ్యానర్ లో చేద్దమాని చెప్పినట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంతన్నది తెలియదు కానీ ఒకవేళ నిజమైనా వెంటనే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. ఎందుకంటే లోకేష్ కూలీ తర్వాత ఖైదీ2(Khaidhi2) చేయాలి. విక్రమ్2(Vikram2), రోలెక్స్(Rolex), లియో(Leo) లైన్ లో ఉన్నాయి. వీటన్నింటినీ పక్కనపెట్టి మరీ లోకేష్ ఇరుంబుకై మాయావి చేస్తాడా అన్నది డౌటే.













