అందుకే మళ్లీ ఆయనతో చేస్తున్నా
టీ సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ జీవితకథా చిత్రం మొఘల్ లో నటించడానికి ఆమీర్ ఖాన్ గతంలో సిద్ధమయ్యారు. అయితే మీటూ ఉద్యమం సమయంలో ఆ చిత్ర దర్శకుడు సుభాష్ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమీర్ ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అప్పట్నుంచి ఆ సినిమా పరిస్థితి సందిగ్ధంలో పడింది. అయితే అమీర్ మనసు మార్చుకున్నారు. మొఘల్ లో నటించేందుకు సిద్ధమైనట్లు ఆయన తాజాగా వెల్లడించారు. సుభాష్ కపూర్‌పై వచ్చిన ఆరోపణలు పని వాతావరణంలో వేధింపులకు సంబంధించినవి కాదని, అందుకే మళ్లీ ఆయనతో కలసి పనిచేసేందుకు ముందుకు వచ్చానని తెలిపారు ఆమీర్.













