కూలీ సెట్స్ లో గజినీ2 ముచ్చట
మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజినీ సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో రిలీజైన ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. సూర్య కెరీర్లోనే గజినీ సినిమా మైల్ స్టోన్ చిత్రంగా మిగిలిపోయింది. తర్వాత మురుగదాస్ అదే సినిమాను బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో తీసి అక్కడ కూడా రికార్డులు సృష్టించాడు.
అలా అమీర్ ఖాన్- మురుగదాస్ మధ్య స్పెషల్ బాండింగ్ ఏర్పడింది. గజినీ ద్వారా మురుగదాస్ కు బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలొచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా గజినీ2 తెరపైకి వస్తోంది. అమీర్ ఖాన్ గజినీ2పై ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడని తెలుస్తోంది. రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో అమీర్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా సెట్స్ లో గజినీ2 డిస్కషన్ రాగా అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఆ సినిమాను చేస్తున్నాడని అంటున్నారు. స్టార్లంతా గజినీ2 గురించి మాట్లాడుకుంటున్నారంటున్నారు. అయితే అమీర్ ఇప్పటికే లోకేష్ తో ఓ సినిమా చేస్తాడని టాక్ ఉంది. 2026లో ఆ సినిమా ఉంటుందంటున్నారు. అంతకంటే ముందే అమీర్ ఖాన్ గజినీ2 చేసే ఛాన్సులున్నట్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంతున్నది తెలియాల్సి ఉంది. గజినీ2 చేస్తే మురుగుదాస్ మాత్రమే దాన్ని చేయాలి అతను తప్ప మరెవరూ ఆ సినిమాను డీల్ చేయలేరు. ప్రస్తుతంమురుగదాస్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో సికిందర్ చేస్తున్న విషయం తెలిసిందే.













