Aamir Khan: రాజమౌళి కి అమీర్‌ఖాన్ షాక్
తనకు ఎప్పటినుంచో మహాభారతంను సినిమా చేయాలనుందని దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) చెప్తున్న విషయం తెలిసిందే. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అని, మొత్తం మహాభారతాన్ని ఐదు భాగాలుగా తెరకెక్కించాలని, అయితే అదే తన ఆఖరి ప్రాజెక్టు అని కూడా రాజమౌళి వెల్లడించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు తాజాగా ఇదే ప్రాజెక్టును అమీర్ ఖాన్(Aamir Khan) తన ప్రొడక్షన్ లో తెరకెక్కిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు.
మహాభారతం(Maha Bharatham)పై తన ప్రొడక్షన్ లో సినిమా రూపొందుతుందని, పలు భాగాలుగా రూపొందనున్న ఆ ప్రాజెక్టులో పలువురు డైరెక్టర్లు భాగం కానున్నారని, ఒకేసారి అన్ని భాగాలు సమాంతరంగా షూటింగ్ జరుపుకోనున్నాయని, ఈ ఏడాదే అది పట్టాలెక్కనుందని అమీర్ ఖాన్ వెల్లడించాడు. భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్టు తెరకెక్కనుందని కూడా అమీర్ ఖాన్ తెలిపాడు.
అమీర్ ఖాన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఇందులో దేశంలోని గొప్ప నటీనటులు యాక్ట్ చేసే అవకాశముంది. ఒకవేళ అంతా సరిగా జరిగి మహాభారతం సక్సెస్ఫుల్ గా ఆడియన్స్ ను మెప్పించగలిగితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టుకు ఉంటుందో లేదో అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి ఒక కథను ఎంత గొప్పగా చెప్పగలడో తెలిసిందే. మహాభారతం లాంటి కాన్సెప్ట్ ను రాజమౌళి లాగా ఎవరూ హ్యాండిల్ చేయలేరని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి, ఒకవేళ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో ఆ ప్రాజెక్టు వచ్చినా రాజమౌళి ప్రాజెక్టుకు ఎలాంటి ఢోకా ఉండదు.






