Aamir Khan: ఆమిర్ సినిమా ఒక్కరోజు కూడా ఆడదన్నారట!
ఆమిర్ ఖాన్(Aamir Khan) కెరీర్లో లగాన్(Lagaan) మూవీకి ఎంత స్పెషల్ ప్లేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు ముందు వరకు ఆమిర్ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. లగాన్ కూడా ఫ్లాపైతే అదే ఆమిర్ లాస్ట్ ఫిల్మ్ అనే స్టేజ్ కు వెళ్లాడు. అయితే తాను ఆ సినిమా చేస్తున్న టైమ్ లో తనను చాలా మంది నిరుత్సాహ పరిచారని ఆమిర్ రీసెంట్ గా తెలిపాడు.
ఏ ధైర్యంతో ఇలాంటి సినిమా చేస్తున్నావని కొందరంటే, ఈ సినిమా ఒక్కరోజు కూడా ఆడదని కొందరన్నారని చెప్పాడు. దానికి తోడు ఆ టైమ్ లో అమితాబ్ బచ్చన్(Amithab Bachan) వాయిస్ ఇచ్చిన సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. లగాన్ కు కూడా అమితాబ్ వాయిస్ ఇవ్వడంతో ఈ సినిమా కూడా ఆ ఫ్లాప్ లిస్ట్ లో చేరుతుందని, లగాన్ ఒక్క రోజు కూడా ఆడదని భయపెట్టారని ఆమిర్ వెల్లడించాడు.
కానీ లగాన్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచిందని, సినిమా హిట్ అవడం మాత్రమే కాకుండా తన కెరీర్ లో మంచి మూవీగా నిలిచిందని, దాంతో పాటూ లగాన్ ఎన్నో అవార్డులను సైతం అందుకుందని ఆమిర్ తెలిపారు. బ్రిటీష్ వాళ్లతో ఇండియన్స్ అంతా కలిసి క్రికెట్ ఆడి గెలిచి పన్ను నుంచి మినహాయింపు పొందే కాన్సెప్ట్ లో తెరకెక్కిన లగాన్ కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.













