ఆకాంక్ష సింగ్ కు లక్కీ ఆఫర్
సుమంత్‌కు జోడీగా మళ్లీ రావా చిత్రంలో హీరోయిన్గా చేసి టాలీవుడ్లోకి ప్రవేశించింది ఆకాంక్ష సింగ్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఆమెకు దేవ్‌దాస్ చిత్రంలో నటించే లక్కీ ఆఫర్ వచ్చింది. ఇందులో నాగార్జునకు జోడీగా ఆకాంక్ష నటించి ఆకట్టుకుంది. ఈ మల్టీస్టారర్ మూవీ హిట్ కావడంతో ఈ బ్యూటీకి మరిన్ని మంచి అవకాశాలు వస్తున్నాయట. ఇప్పుడు ఆకాంక్ష కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న పహిల్వాన్ అనే చిత్రంలో అతనికి జోడీగా నటిస్తోంది. అదేవిధంగా బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్ చేస్తున్న ఓ చిత్రంలో కూడా ఆకాంక్ష ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.













