ఆది సాయికుమార్ కొత్త సినిమా షురూ
వైవిద్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆది సాయి కుమార్. తాజాగా ఆది కథానాయకుడిగా నాటకం సినిమా ఫేమ్ కళ్యాణ్ జి.గోగణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కమేడియాన్ సునీల్ కీలక పాత్రధారి. టి.ఎం.కె అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా లో పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈచిత్రం కోసం ఆది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి బాల్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రంలో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పూర్ణ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు నటిస్తారు.













