‘క్రేజీ ఫెలో’ గా ఆది సాయికుమార్ టైటిల్ ఖారారు
యంగ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేకే రాధమోహన్ నిర్మాణంలో ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి టైటిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘క్రేజీ ఫెలో’ అనే టైటిల్ ఖారారు చేశారు. ఈ చిత్రంలో ఆది పోషిస్తున్న పాత్రకు తగ్గట్టు ఈ టైటిల్ ని ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. టైటిల్ కి తగినవిధంగా ఈ చిత్రంలో ఆది విభన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. టైటిల్ పోస్టర్ కూల్ అండ్ క్లాస్ గా ఆకట్టుకుంది. కంప్లీట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దిగంగన సూర్యవంశి, మర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు.













