స్పోర్టస్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది
ఆది పినిశెట్టి, ఆకాంక్షా సింగ్ జంటగా నటించిన చిత్రం క్లాప్. పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించారు. ఐబి కార్తికేయన్ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం.రాజశేఖర్ రెడ్డి నిర్మించి ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో ఆది స్ప్రింటర్‌గా కనిపిస్తున్నాడు. స్పోర్టస్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సరైన స్ప్రింటర్‌లా కనిపించడానికి ఆది కఠినమైన శిక్షణ శిక్షణ తీసుకున్నారు. తమిళ-తెలుగు భాషల్లో రూపొందిన చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఒలింపిక్స్‌లో భారతదేశం మంచి ప్రతిభను ప్రదర్శిస్తున్నందున మా సినిమా టీజర్ విడుదలకు ఇది సరైన సమయం అని భావించి, ఈ నెల 6న టీజర్ రిలీజ్ చేస్తున్నాం అని చిత్రబృంధం పేర్కొంది.













