Aadhi Pinisetty: అఖండ2 లో నటించడం నా అదృష్టం
టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు ఆది పినిశెట్టి(Aadhi Pinisetty) ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), బోయపాటి శ్రీను(Boyapati srinu) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ2(akhanda2) సినిమాలో విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది, బాలకృష్ణతో కలిసి పని చేసిన అనుభవాన్ని షేర్ చేసుకున్నాడు. బాలయ్య(balayya) వ్యక్తి కాదని, ఆయనొక శక్తి అన్నాడు.
బాలయ్య స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో, రియల్ లైఫ్ లో కూడా అలానే ఉంటాడని, ఆయన కాన్ఫిడెన్స్, కష్టపడి పని చేసే తత్వం ఎంతో మందికి ఇన్సిపిరేషన్ గా ఉంటుందని, ఆయన్నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఇక బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మ్యాజిక్ ఉంటుందని, బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో తనకు అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పాడు.
అయితే హీరోగా నటిస్తూ కూడా విలన్ గా ఎందుకు నటిస్తారని అడగ్గా దానికి ఆది చెప్పిన ఆన్సర్ అందరినీ ఎట్రాక్ట్ చేసింది. మనిషిలో మంచీ చెడూ ఉంటాయని, పాజిటివ్ పాత్రలు మాత్రమే చేస్తుంటే కొంతకాలానికి వాటిపై ఇంట్రెస్ట్ తగ్గుతుందని, కానీ విలన్ క్యారెక్టర్లకు ఎలాంటి లిమిట్స్ ఉండవని, విలన్ పాత్రల్లో నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని చెప్పాడు ఆది.







