A Master Piece: తెలుగు సినిమా ఖ్యాతిని మరో మెట్టు పైకి తీసుకెళ్లేలా “ఏ మాస్టర్ పీస్” – మూవీ టీమ్

శుక్ర, మాటరాని మౌనమిది వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా “ఏ మాస్టర్ పీస్” (A Master Piece). అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వజ్, మనీష్ గిలాడ, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. క్లైమాక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ రోజు “ఏ మాస్టర్ పీస్” షూటింగ్ కవరేజ్ కు మీడియా మిత్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో
దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ – “ఏ మాస్టర్ పీస్” సినిమా షూటింగ్ కవరేజ్ కు వచ్చిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేందుకు శ్రీకాంత్ కండ్రేగుల గారు కారణం. ఆ తర్వాత మనీష్ గిలాడ మా చిత్ర ప్రొడక్షన్ లో భాగమై సినిమాను ఇంకో స్థాయికి తీసుకెళ్లారు. ఆయన ఈ చిత్రంలో సూపర్ విలన్ గా నటిస్తున్నారు. అరవింద్ కృష్ణ కెరీర్ గురించి మీ అందరికీ తెలిసిందే. “ఏ మాస్టర్ పీస్” చిత్రంలో సూపర్ హీరోగా ఆయన కనిపిస్తారు. ఈ చిత్ర కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను. దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో ఒక వరం లభిస్తుంది, ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో క్యారెక్టర్ ను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ పాత్రను క్రియేట్ చేశాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ఇప్పటి కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్ ను “ఏ మాస్టర్ పీస్” చిత్రంలో చూస్తారు. అరవింద్ కృష్ణ సూపర్ హీరోగా అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. అలాగే మనీష్ గిలాడ సూపర్ విలన్ గా ఆకట్టుకుంటాడు. డిఫరెంట్ రోల్స్ లో జ్యోతి పూర్వజ్ నా వైఫ్, ఎంతో బాగా నటించింది. మా టీమ్ అంతా నా వెన్నంటి ఉండి మూవీకి వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. ఈ కథలో శివుడి నేపథ్యం ఉంటుంది కాబట్టి మేము అనుకున్న వర్క్స్ అనుకున్నట్లు జరిగితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యోగి పోసాని మాట్లాడుతూ – “ఏ మాస్టర్ పీస్” సినిమా షూటింగ్ తో పాటు వీఫ్ఎక్స్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాం. క్లైమాక్స్ షూటింగ్ ఎంత గ్రాండ్ గా చేస్తున్నామో మీకు చూపించాలనే మీడియా మిత్రులను ఇన్వైట్ చేశాం. ఈ భారీ క్లైమాక్స్ ను పక్కా ప్లానింగ్ తో చేస్తున్నాం. ప్రతి టీమ్ మెంబర్ మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా “ఏ మాస్టర్ పీస్” చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అన్నారు.
హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ – “ఏ మాస్టర్ పీస్” చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ పూర్వాజ్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా. అనివార్య కారణాలతో మా సినిమా షూటింగ్ కొంత ఆలస్యమైంది. నాకు కొన్నిసార్లు గాయాలు అయ్యాయి. దాంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేయాల్సివచ్చింది. నాకోసం మా డైరెక్టర్ పూర్వాజ్ గారు చాలా వెయిట్ చేశారు. నాకే కాదు మా టీమ్ లోని చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. అవన్నీ గుర్తొస్తే నేను ఎమోషనల్ అవుతాను. మనం జీవితంలో ఏదో గొప్పగా సాధించబోయో ముందు ఇలాంటి కష్టాలు వస్తుంటాయని అంటారు. “ఏ మాస్టర్ పీస్” సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోంది. మనీష్ గిలాడ మా చిత్రంలో సూపర్ విలన్, కానీ మా సినిమాకు ప్రొడక్షన్ సైడ్ నిలబడ్డ సూపర్ హీరో. జ్యోతి పూర్వాజ్ గారు బాగా నటించారు. మా ప్రొడ్యూసర్స్ ఎంతో ప్యాషనేట్ గా మూవీ చేస్తున్నారు. మా టీమ్ అందరికీ థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నా. అన్నారు.
సూపర్ విలన్, ప్రొడ్యూసర్ మనీష్ గిలాడ మాట్లాడుతూ – ఈ రోజు మా సినిమా షూటింగ్ కవరేజ్ కు వచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మా సినిమా ఎంత పెద్ద స్కేల్ లో షూటింగ్ చేస్తున్నామో మీకు చూపించేందుకే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మా “ఏ మాస్టర్ పీస్” మూవీ టీజర్ రిలీజ్ చేసి 14 నెలలు అవుతోంది. ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్ చేస్తున్నాం. అనివార్య కారణాలతో డిలే అయ్యింది. ఈ రోజు రేపటి కల్లా మొత్తం మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. క్లైమాక్స్ కోసం ఓ సాంగ్ షూట్ చేస్తున్నాం. మా ప్రొడ్యూసర్స్ షూటింగ్ మాత్రమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కూడా హై క్వాలిటీతో చేస్తున్నారు. నాలోని సూపర్ విలన్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నా మా డైరెక్టర్ పూర్వాజ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ మాట్లాడుతూ – నేను రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. ఆ తర్వాత ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా లైఫ్ పార్టనర్ గా మారాడు. “ఏ మాస్టర్ పీస్” సూపర్బ్ స్క్రిప్ట్ తో వస్తోంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్ లో ఉంటుంది. ప్రేక్షకులు ఒక్కోసారి ఆశ్చర్యపోతారు. నా కెరీర్ లో నటిగా సంతృప్తినిచ్చిన క్యారెక్టర్ ఇది. మైథాలజీని, సూపర్ హీరో జానర్ ను కలిపి ఒక గొప్ప చిత్రాన్ని డైరెక్టర్ పూర్వాజ్ రూపొందిస్తున్నారు. నేను పేర్లు చెప్పను గానీ తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప చిత్రాల సరసన “ఏ మాస్టర్ పీస్” చేరుతుంది. సూపర్ హీరోగా మనం ఎలా ఊహించుకుంటామో అలా అరవింద్ కృష్ణ కనిపిస్తారు. అరవింద్ కృష్ణతో నేను గతంలో ఓ చిత్రంలో నటించాను. మనీష్ గిలాడ సూపర్ విలనీ ఆకట్టుకుంటుంది. మా ప్రొడ్యూసర్స్ అందరికీ థ్యాంక్స్. భారీ మేకింగ్ తో “ఏ మాస్టర్ పీస్” రూపొందిస్తున్నాం. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ – మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా వచ్చాక అలాంటి ఒక సూపర్ హీరో చిత్రాన్ని మనం తెలుగులో ఎందుకు చేయకూడదు అని “ఏ మాస్టర్ పీస్” మొదలుపెట్టాం. మా మూవీకి ఇంధనం పూర్వాజ్ గారు అయితే ప్రాజెక్ట్ మరింత బలాన్నిచ్చింది మాత్రం మెర్జ్ ఎక్స్ ఆర్, మనీష్ గిలాడ. నేను స్లీపింగ్ పార్టనర్ లా ఉన్నాను. ఈ సెట్ చూస్తే మీకు “ఏ మాస్టర్ పీస్” ఎంత భారీస్థాయిలో రూపొందిస్తున్నామో తెలుస్తుంది. హాలీవుడ్ లో కూడా ఉపయోగించని టెక్నాలజీని మా సినిమాకు వాడుతున్నాం. అన్నారు.