Nabha Natesh: యాక్సిడెంట్ తర్వాత వర్కవుట్ విషయంలో చాలా మారా: నభా
నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన నభా నటేష్(Nabha Natesh) ఫస్ట్ సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకుంది. తర్వాత రామ్(Ram Pothineni) కు జోడీగా ఇస్మార్ట్ శంకర్(ismart Shankar) లో నటించి మంచి బ్రేక్ అందుకున్న నభా ఆ తర్వాత చేసిన డిస్కో రాజా(Disco Raja), సోలో బ్రతుకే సో బెటర్(Solo Brathuke So Better), అల్లుడు అదుర్స్(Alludu Adhurs), మ్యాస్ట్రో(Mastro), డార్లింగ్(Darling) సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి.
మధ్యలో అమ్మడు ఓ ఏడాది పాటూ ఏ సినిమాలోనూ కనిపించలేదు. దానికి కారణం ఆమె యాక్సిడెంట్ కు గురవడం. యాక్సిడెంట్ వల్ల నభాకు కొన్ని సర్జరీలు కూడా అయ్యాయి. దాని వల్ల తానెంతో బాధను అనుభవించినట్టు నభా ఇప్పటికే చాలా సార్లు చెప్పింది. యాక్సిడెంట్ లో భుజం గాయపడి కొన్ని సర్జరీలు చేశారని, ఆ టైమ్లో తన ఫిట్నెస్ ను తిరిగి పొందడానికి ఎంతో కష్టపడినట్టు నభా రీసెంట్ గా తెలిపింది.
యాక్సిడెంట్ తర్వాత వర్కవుట్స్ చేయడాన్ని తానెంతో ఎంజాయ్ చేస్తున్నానని, శరీరంపై అవగాహన పెరిగిందని, మొబిలిటీ ఎక్సర్సైజ్లు, స్విమ్మింగ్, డ్యాన్సింగ్ చేయడాన్ని ఇష్టపడుతున్నానని, అంతకు ముందు నటిగా ఉన్నప్పుడు ఏదో తప్పదు కాబట్టి వర్కవుట్స్ చేయాలని చేసేదాన్నని, కానీ ఇప్పుడు వర్కవుట్స్ విషయంలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిందని వెల్లడించింది నభా. ఇదిలా ఉంటే అమ్మడు ప్రస్తుతం స్వయంభు(Swayambhu), నాగబంధం(Naga Bandham) సినిమాలతో బిజీగా ఉంది.













