హమ్మయ్యా ఎట్టకేలకు ఒక ఛాన్స్
ఏ పరిశ్రమలో అయినా సరే సక్సెస్ ఉంటేనే వారికి అవకాశాలుంటాయి. సక్సెస్ లేకపోతే ఈ రోజుల్లో ఏదీ ఎక్కువ కాలం ఉండదు. సినీ పరిశ్రమలో ఈ సక్సెస్ పాత్ర ఇంకా కీలకం. హిట్టున్నప్పుడు ఒకలా చూస్తారు. లేనప్పుడు మరోలా చూస్తారు. ప్రస్తుతం ఇలాంటి సిట్యుయేషన్లోనే ఉంది టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.
గతేడాది పక్కా కమర్షియల్, థాంక్యూ సినిమాలతో డిజాస్టర్లు అందుకున్న రాశీకి ఆ తర్వాత తెలుగులో ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం ఆడిషన్ కు వెళ్లిన రాశీకి ఆ ఛాన్స్ మిస్ అయింది. తర్వాత పలు యంగ్ హీరోలతో సినిమాలు చేసేందుకు ట్రై చేసినప్పటికీ ఎవరూ ఆమెకు ఛాన్సులివ్వలేదని వార్తలొచ్చాయి.
అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రాశీకి సరైన టైమ్ లో ఓ సినిమా ఛాన్స్ వచ్చింది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా, కాస్ట్యూమ్ డిజైనర్ టర్డ్న్ డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న తెలుసు కదా సినిమాలో రాశీకి హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సినిమాతో అయినా రాశీ హిట్ కొడితే తనకు మళ్లీ ఛాన్సులొచ్చే అవకాశం ఉంది. మరి తెలుసు కదా రాశీకి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













