90 ఎమ్ ఎల్ ట్రైలర్ విడుదల
తమిళ చిత్రం 90 ఎమ్.ఎల్ తెలుగులో అదే పేరుతో అనువాదమవుతున్నది. ఇది చాలా తక్కువ ఉపశీర్షిఖ. అనిత్ ఉదీప్ దర్శకురాలు. కర్ణ ఫిల్మ్ ఫ్యాక్టరీ కృష్ణ కాకర్లమూడి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. త్వరలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్ను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ఐదుగురు అమ్మాయిల చుట్ట తిరిగే కథ ఇది. పుట్టినరోజు పార్టీ సందర్భంగా వారు అనుకోకుండా మద్యాన్ని సేవిస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది ఆసక్తికరంగా సాగుతుంది. యువతకు నచ్చే కథ ఇది. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా అలరిస్తుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఓవియా హెలెన్, హన్సాన్పాల్, మాసూమ్శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : అరవింద్ కృష్ణ.













