గోవాలో వంద మందితో.. 7 డేస్ 6 నైట్స్
ఎమ్.ఎస్.రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 7 డేస్ 6 నైట్స్. డర్టీహరి తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా ఇది. సుమంత్ అశ్విన్ కథానాయకుడు. ఆయనే ఎస్.రజనీకాంత్‌తో కలిసి నిర్మిస్తున్నారు. మెహర్ చాహల్ నాయిక. గోవాలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. తదుపరి షెడ్యూల్ కోసం ఉడుపివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ విభిన్నమైన కథనం, సన్నివేశాలతో ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. 16 మంది కొత్తతరం ప్రతిభావంతుల్ని పరిచయం చేస్తున్నా. అందులో 16 ఏళ్ల సంగీత దర్శకుడు సమర్థ్ కూడా ఉన్నాడు. రుతుపవనాలతో భారీ వర్షాలు కురుస్తున్నా, కరోనా నియమాలు కఠినంగా అమలవుతున్నా గోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటా. 100 మంది బృందంతో, 4 కెమెరాలతో సన్నివేశాల్ని తెరకెక్కించాం అన్నారు.













