ఏడు చేపల కథ ఫస్ట్ లుక్ విడుదల
అభిషేక్ రెడ్డి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఏడు చేపల కథ. భానుశ్రీ, ఆయేషా సింగ్ కథానాయికలు. శామ్ జె.చైతన్య దర్శకుడు. నగరం సునీల్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. శేఖర్ రెడ్డి, జి.వి.ఎన్ నిర్మాతలు. ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ టెమ్ట్ రవి అనే ఓ ప్రయోగాత్మక పాత్రని పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు శామ్ జె.చైతన్య విభిన్నమైన అంశంతో రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలతో ఏడు చేపల కథ నడుస్తుంది. ఏడు చేపల్లో ఎన్ని ఎండాయి? అ చేపల వెనుకున్న అసలు కథేమిటన్నది తెరపైనే చూడాలి. త్వరలోనే టీజర్‌ని విడుదల చేస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కవిశంకర్, ఛాయాగ్రహణం: ఆర్లీ.













