జాతీయ అవార్డుల ప్రదానోత్సవం
66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా విజేతలు పురస్కారాల్ని స్వీకరించారు. మహానటి చిత్రానికిగాను కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. ఉత్తమ నటుడు విభాగంలో విక్కీకౌశల్ (ఉరి), ఆయుష్మాన్‌ఖురానా (అంధాధున్) సంయుక్తంగా అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ఫాల్కే అవార్డుకు అమితాబ్‌బచ్చన్ ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ ప్రదానోత్సవ వేడుకకు హాజరుకాలేకపోయారు. ఈ నెల 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డు గ్రహీతలకు తేనీటి విందు ఏర్పాటు చేయబోతున్నారు. అదేరోజు అమితాబ్‌బచ్చన్ దాదా సాహెబ్‌ఫాల్కే పురస్కారాన్ని అందుకుంటారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.













