47 డేస్ ట్రైలర్ ను విడదుల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ
హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 47 డేస్.. పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్టు చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచే, శ్రీధర్ మక్కెన, విజయ్ శంకర్ దొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. తమ్మారెడ్డి భరద్వాజు ట్రైలర్ను విడుదల చేసి టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, ఆర్పి పట్నాయక్, దర్శకుడు బివిఎస్ రవి, సతీష్ కాశెట్టి, కత్తి మహేష్, దర్శకుడు వెంకటేష్ మహా, లక్ష్మీ భూపాల్, గీత రచయిత భాస్కరభట్ల, రఘు కుంచె, నిర్మాతలు శశిభూషణ్, శ్రీధర్, విజయ్, దర్శకుడు ప్రదీప్ మద్దాలి, హీరో సత్యదేవ్ తదితరులు మాట్లాడారు.













