Pan India: రాబోయే మూడు వారాల్లో 4 పాన్ ఇండియా రిలీజులు

అప్పుడే 2025లో సగం అయిపోయింది. కానీ ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి పెద్ద సినిమాలు రాలేదు. పలు కారణాల వల్ల రావాల్సిన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దీంతో తెలుగు ఆడియన్స్ పెద్ద సినిమాల కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితా వారి ఎదురుచూపులకు ఇప్పుడు తెర పడబోతుంది. రాబోయే మూడు వారాల్లో దాదాపు నాలుగు పెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టులు టాలీవుడ్ లో రిలీజ్ కాబోతున్నాయి.
వాటిలో ముందు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హరి హర వీరమల్లు(Hari Hara Veeramallu) రిలీజ్ కానుంది. పలు వాయిదాల తర్వాత ఇన్నేళ్లకు ఈ సినిమా రిలీజ్ కానుండటంతో వీరమల్లుపై అందరికీ ఎంతో ఆసక్తి నెలకొంది. ఆ తర్వాత వారానికి జులై 31న విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కింగ్‌డమ్ సినిమా రిలీజ్ కానుంది. గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
ఆ తర్వాత ఆగస్ట్ లో వార్2(War2), కూలీ(Coolie) రానున్నాయి. ఎన్టీఆర్(NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన వార్2 సినిమాతో పాటూ, లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) దర్శకత్వంలో రజినీకాంత్(Rajinikanth) చేసిన కూలీ(Coolie) సినిమా కూడా ఒకే రోజున రిలీజ్ కానున్నాయి. ఆగస్ట్ 14న ఈ రెండూ సినిమాలూ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. మొత్తానికి రాబోయే మూడు వారాలు తెలుగు ఆడియన్స్ కు పండగనే చెప్పాలి.