రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటి
ప్రముఖ నటి, బాలీవుడ్ బ్యూటీ దియా మిర్జా రెండో సారి పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైంది. దియా 2004 సంవత్సరంలో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది. ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు. అయితే విడాకుల అనంతరం వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా ప్రేమాయణం నడుపుతున్నట్టు అనేక ప్రచారాలు నడిచాయి. దీనిపై తాజా క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 15న ముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. ఇరువురి కటుంబాలు వీరికి పెళ్ళికి అంగీకారం తెలపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు. కాగా దియా ప్రస్తుతం తెలుగులో వైల్డ్ డాగ్ మూవీలో నటిస్తున్నారు.













