మెగాస్టార్ కు 30 ఏళ్లు
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఈ ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును జత చేసి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. 1988 ఆగస్టు 4న సూపర్‌హిట్ మూవీ మరణమృదంగం విడుదలైంది. ఈ చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు సినిమా విడుదల సందర్భంగా చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అనే బిరుదును జత చేశారు. అప్పటిదాక సుప్రీమ్ హీరో, డైనమిక్ హీరో అంటూ రకరకాల ట్యాగులతో చిరు పేరును వాడుకున్న దర్శ నిర్మాతలు మరణమృదంగం తర్వాతే మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోయారు. ఈ సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయింది. అంటే చిరంజీవి పేరుకు ముందు మెగాస్టార్ అని సిల్వర్‌స్క్రీన్స్ మీద పడి మూడు దశాబ్దాలు అయింది.













