30 రోజుల్లో ప్రేమించటం ఎలా?
వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మున్నా దర్శకుడు. అమృతా అయ్యర్ కథానాయిక. ఎస్వీ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ ప్రదీప్ పాత్ర రెండు పార్శ్వాల్లో సాగుతుంది. భావోద్వేగభరితంగా సాగే ప్రేమకథ చిత్రమిది. మహేష్‌బాబు విడుదల చేసిన నీలి నీలి ఆకాశం.. పాట యాబై మిలియన్ల వ్యూస్ సాధించి విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఓ ప్రణయ్య దృశ్య కావ్యంలా దర్శకుతు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటో గ్రఫీ: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్‌రూబెన్స్, పాటలు: చంద్రబోస్.













